ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణా జిల్లాలో రాష్ట్ర వ్యవసాయ మిషన్​ వైస్​ ఛైర్మన్​ పర్యటన - కృష్ణా జిల్లా తాజా వార్తలు

కృష్ణా జిల్లాలో రాష్ట్ర వ్యవసాయ మిషన్​ వైస్​ ఛైర్మన్​ ఎం.వీ.ఎస్​.నాగిరెడ్డి పర్యటించారు. కూరగాయలు, పండ్ల తోటలు పరిశీలించి రైతు సమస్యలు తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను ముఖ్యమంత్రికి తెలియజేస్తామన్నారు.

state agriculture mission vc visited krishna district
రాష్ట్ర వ్యవసాయ మిషన్​ వైస్​ చైర్మన్​

By

Published : Apr 11, 2020, 12:21 PM IST

కృష్ణా జిల్లా మోపిదేవిలంక, నాగాయతిప్ప గ్రామాల్లో అరటి కాయలకు ఒక్కసారిగా ధరలు పడిపోయాయి. గతంలో ఇక్కడి నుంచి ఒడిశాకు అరటికాయలు ఎగుమతి జరిగేవి. లాక్​డౌన్​ కారణంగా అరటిని కొనేవారే లేకుండా పోయారు. మరోవైపు.. బయటి నుంచి పచ్చ అరటి స్థానిక మార్కెట్లకు, రైతు బజార్లకు వస్తుండడంపై.. రైతులు ఆందోళన చెందుతున్నారు. టమాటా కూడా బయట నుంచి దిగమతి కావడం వల్ల ఇక్కడి రైతులు నష్టపోతున్నారు. ఎగుమతులు లేనుందున బజ్జి మిర్చి రైతులు కోయకుండానే పొలాల్లో వదిలేస్తున్నారు. జామకాయలు కొనే నాధుడే లేకుండా పోయాడు. ఈ సమస్యలను రాష్ట్ర వ్యవసాయ మిషన్​ వైస్​ చైర్మన్​ ఎం.వీ.ఎస్​. నాగిరెడ్డి పరిశీలించారు. సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details