కృష్ణా జిల్లా రెడ్డికుంటలో మామిడి దిగుబడి, ఎగుమతులు ప్రారంభమయ్యాయి. ఉగాది వెళ్లాకే సాధారణంగా మొదలయ్యే కోత.... ఈసారి ముందుగానే రావడంతో.... ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. నేరుగా రైతులతో చర్చిస్తున్న ఉత్తరాది వ్యాపారులు... పొలం వద్దకే వచ్చి టన్నుకు 95వేల రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. కొన్నేళ్లుగా కృష్ణా జిల్లాలో చాలా మంది మామిడి సాగుదారులు అనుసరిస్తున్న కవర్ల విధానం.. నాణ్యమైన దిగుబడి అందిస్తోంది. ఈ విధానం వల్ల.... ఒక్కో కాయ అరకిలో వరకూ ఉంటుండడమే కాక.. తెగుళ్ల బారి నుంచి రక్షణ సైతం లభిస్తోంది.
ఫలరాజం మామిడి దిగుబడి ప్రారంభం
రాష్ట్రంలో ఫలరాజం మామిడి దిగుబడి ప్రారంభమైంది. మామిడికాయలకు కవర్లు కట్టే వినూత్న విధానంతో నాణ్యమైన ఫలాలను పండిస్తున్న కృష్ణా జిల్లా రెడ్డికుంట రైతులు.. స్వయంగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. దళారుల జోక్యం లేకపోవడం వల్ల మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.
ఫలరాజం మామిడి దిగుబడి ప్రారంభం
కవర్లు కట్టడం వల్ల కార్బైడ్ అవసరం లేకుండానే పండించొచ్చని.... మంచి రంగు, రుచి ఉన్న దిగుబడి వస్తుందని ఉద్యాన అధికారులు చెప్తున్నారు. ఈసారి వాతావరణం ఇప్పటివరకూ ఆశాజనకంగా ఉండటంతో... ఇతర మామిడి రకాల్లోనూ మంచి దిగుబడి వస్తుందని భావిస్తున్నారు.