ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పది' పరీక్షలకు పదింతల జాగ్రత్తలు.

‘కొవిడ్‌ - 19’ నియంత్రణలో భాగంగా గత మార్చి నెలలో ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు నిలిచిపోయిన పది పరీక్షలు తిరిగి జూన్‌ 8 నుంచి పునః ప్రారంభిస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఈ క్రమంలో పరీక్షల నిర్వహణ ఏర్పాట్లకు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది.

By

Published : May 24, 2020, 12:04 AM IST

ssc exam arrangements in kothagudem
భద్రాద్రి జిల్లాలో పది పరీక్షలకు ఏర్పాట్లు

తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 14,138 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. వీరికోసం ఇప్పటికే సిద్ధం చేసిన 75 పరీక్షా కేంద్రాల్లో అదనంగా మరో 63 తరగతి గదులను ఏర్పాటు చేస్తున్నారు. వాటిల్లో పర్యవేక్షణకు డిపార్టుమెంటల్‌ అధికారులను కేటాయించేందుకు చర్యలు చేపడుతున్నారు. పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఏర్పాట్లు చేయడంపై విద్యాశాఖ దృష్టి సారించింది.

గతం కన్నా భిన్నంగా జిల్లాలో ఇలా..

  • జిల్లావ్యాప్తంగా విద్యార్థుల కోసం 15 వేల మాస్కులను సిద్ధం చేశారు.
  • గతంలో ఒక పరీక్ష గదిలో 24 మందిని కూర్చోబెట్టేవారు. ఇప్పుడు 12 మందే ఉంటారు. జిక్‌జాగ్‌ పద్ధతిలో బల్లకు ఒక్కరే కూర్చుంటారు.
  • పరీక్ష గదిలోకి వెళ్లే ముందు, పరీక్ష పూర్తయ్యాక చేతులను శానిటైజర్లతో శుభ్రం చేసుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తారు.
  • పరీక్షల నిర్వాహకులకు గ్లౌజులు, మాస్కులు, శానిటైజర్లు అందజేస్తారు.
  • పరీక్షల గదుల్లో బ్లీచింగ్‌, రసాయనాలు పిచికారి చేస్తారు.
  • మొత్తం 138 థర్మల్‌ స్క్రీనింగ్‌ పరికరాలను అందుబాటులో ఉంచుతారు.
  • శారీరక రుగ్మతలున్నవారు ప్రత్యేక గదిలో పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
  • అనారోగ్యంతో బాధపడే ఉద్యోగుల స్థానంలో వేరేవారికి విధులు కేటాయిస్తున్నారు.

అన్నిశాఖల సమన్వయంతో ముందుకు

ప్రభుత్వ శాఖలను సమన్వయంతో పరీక్షలను సజావుగా నిర్వహిస్తాం. వైద్యశాఖ ఆధ్వర్యంలో పరీక్షా గదులు, ఆవరణలో శానిటైజేషన్‌ పనులు కొనసాగిస్తాం. వైద్యసిబ్బంది అందుబాటులో ఉంటారు. విద్యార్థులకు మాస్క్‌లను అందించడంతో పాటు శానిటైజర్లను అందుబాటులో ఉంచుతాం. కేంద్రాల్లో భౌతిక దూరాన్ని పాటించేలా తగిన చర్యలు తీసుకుంటాం.

- సరోజినీదేవి, డీఈవో

ABOUT THE AUTHOR

...view details