ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'షాదీఖానాకు పూర్వ వైభవం కల్పించండి' - nandigama latest news

కృష్ణా జిల్లా నందిగామలోని షాదీఖానా శిథిలావస్థలో ఉండటం పట్ల ముస్లింలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు శుభ కార్యక్రమాలు, ప్రార్థలు చేస్తూ సందడిగా ఉండే ఈ ప్రాంగణంలో ప్రస్తుతం పిచ్చి మొక్కలతో అడవిని తలపిస్తోంది. దీనికి మరమ్మతులు చేపట్టాలని ముస్లింలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

By

Published : Nov 30, 2020, 8:48 PM IST

కృష్ణా జిల్లా నందిగామలో రెండు దశాబ్దాల క్రితం నిర్మించిన షాదీఖానా ప్రస్తుతం పూర్తిగా శిథిలమైపోయింది. పిచ్చి మొక్కలతో ఆ ప్రాంగణం అడవిని తలపిస్తోంది. అటుగా వెళ్లాలంటేనే భయబ్రాంతులకు గురి అయ్యే పరిస్థితి నెలకొంది. కొంతకాలం వరకు ముస్లింలు అక్కడ శుభకార్యాలు చేసుకునేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడం వల్ల ప్రైవేట్ ఫంక్షన్ హాల్​కు వేల రూపాయలు చెల్లిచాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో పేద, మధ్య తరగతి వర్గాల వాళ్లపై అర్థిక భారం పడటం వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

నూతన షాదీఖానా నిర్మాణానికి రూ. కోటి అరవై నాలుగు లక్షల అంచనాలతో ప్రతిపాదన తయారు చేసి అధికారులకు పంపించారు. ఇటీవల మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఉపముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషాకు విజ్ఞప్తి చేశారు. షాదీఖానాకు పూర్వ వైభవం తీసుకురావాలని ముస్లింలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details