జలగం వెంగళరావు, దగ్గుబాటి వెంకటేశ్వర రావు, ఎస్వీ రంగారావు, పరుచూరి బ్రదర్స్, కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ..వంటి హేమా హేమీలను అందించిన స్కూల్ అది. కాని ప్రస్తుతం చదువుకునేందుకు పాఠశాలలో కూర్చోలేని పరిస్థితి. శతాబ్దాల చరిత్ర గల కృష్ణాజిల్లా నూజివీడు శ్రీరాజారంగయ్య అప్పారావు విద్యాలయంలో కనీస సౌకర్యాలు లేమి చరిత్రను వెక్కిరిస్తోంది. ఎస్ఆర్ఆర్ బాయ్స్ హై స్కూల్ గా పిలవబడే ఈ పాఠశాలలో స్లాబ్ పెచ్చులు ఊడిపడుతున్నాయి. వర్షం వచ్చిందంటే చాలు తరగతి గదిలోకి నీరు చేరుతోంది. మరుగుదొడ్ల పరిస్థితి చెప్పనక్కర్లేదు. పాఠశాల దీన పరిస్థితిని చూసిన పూర్వ విద్యార్దులు తమ వంతు బాధ్యతగా సైకిల్ స్టాండ్ ను ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారి వెంట విశాలమైన ప్రాంగణంలో ఠీవిగా కనిపించే ఈ పాఠశాలకు ప్రభుత్వం నుంచి రావల్సిన నిధులు రావడం లేదని విద్యార్ధులు-ఉపాధ్యాయులు వాపోతున్నారు.
మహానుభావులను అందించిన పాఠశాలను..పట్టించుకునేవారెవరు!
ఎందరో మహానుభావులను అందించిన పాఠశాల..ఇప్పుడు ప్రభుత్వ చేయుతకు ఎదురు చూస్తోంది. పట్టించుకునే నాధుడు లేక తరగతి గదుల్లోకి నీరు చేరుతోంది. పై పెచ్చులు ఊడుతు విద్యార్దులను భయకంపితులను చేస్తోంది.
srirsja rangaiah apparao school has Slab flakes are swinging in nuziveedu at krishna district