శ్రీనగర్ నిట్‌లో చదువుకుంటున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థులు దిల్లీ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. జమ్ము నుంచి అండమాన్ ఎక్స్‌ప్రెస్‌లో సుమారు 31 మంది విద్యార్థులు ఇక్కడకు వచ్చారు. ఏపీభవన్ అధికారులు విద్యార్థులకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి 12 గంటల సమయంలో వీరంతా జమ్ము నుంచి బయల్దేరారు. ఇదే రైలులో విద్యార్థులు తెలుగు రాష్ట్రాలకు రానున్నారు. ఆదివారం ఉదయం మరో 90 విద్యార్థులు జమ్ము నుంచి స్వస్థలాలకు పయనమయ్యారు.
దిల్లీకి చేరుకున్న తెలుగు విద్యార్థులు - andaman express
కేంద్రం ఆదేశాలతో జమ్ము-కశ్మీర్లో నిట్ విద్యాసంస్థకు సెలవులు ప్రకటించారు. అక్కడ చదువుకునే తెలుగు విద్యార్థులు రాష్ట్రానికి పయనమవుతున్నారు.
తెలుగు విద్యార్థులు