విజయవాడ ఇంద్ర కీలాద్రిపై దేవిశరన్నవరాత్రులు ఆరో రోజు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ లలితా త్రిపురసుందరీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో చంద్రశేఖరరెడ్డి సహా ఆలయ అర్చకులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. కరోనా బారి నుంచి ప్రజలను రక్షించాలని ప్రత్యేక పూజలు చేశారు.
బెజవాడ దుర్గమ్మకు శ్రీకాళహస్తి ఆలయం తరఫున పట్టువస్త్రాలు సమర్పణ - vijayawada temple latest news updates
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవిశరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నవరాత్రుల్లో ఆరో రోజున అమ్మవారు శ్రీ లలితా త్రిపురసుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి శ్రీకాళహస్తి ఆలయం తరఫున అధికారులు పట్టువస్త్రాలు సమర్పించారు.
బెజవాడ దుర్గమ్మకు శ్రీకాళహస్తి ఆలయం తరఫున పట్టువస్త్రాలు సమర్పణ