ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీచైతన్య విద్యాసంస్థల...ఫిట్ ఇండియా ప్రపంచ రికార్డులు కైవసం

ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా శ్రీ చైతన్య విద్యాసంస్థలు... లక్షకు మందికి పైగా విద్యార్థులతో స్పోర్ట్స్ డ్రిల్ నిర్వహించి రెండు ప్రపంచ రికార్డులను నెలకొల్పాయి

శ్రీచైతన్య విద్యాసంస్థల...ఫిట్ ఇండియా ప్రపంచ రికార్డులు కైవసం
శ్రీచైతన్య విద్యాసంస్థల...ఫిట్ ఇండియా ప్రపంచ రికార్డులు కైవసం

By

Published : Dec 5, 2019, 5:58 AM IST

శ్రీ చైతన్య విద్యాసంస్థలు రెండు ప్రపంచ రికార్డులను నెలకొల్పాయి. ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ఏడు రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో ఒకటి నుంచి అయిదవ తరగతి వరకూ సూమారు లక్ష మందికి పైగా విద్యార్థులు 214 వేదికలపై ఏకకాలంలో ఏడు నిమిషాల పాటు స్పోర్ట్స్ డ్రిల్​ను నిర్వహించారు.ఈ విభాగంలో రికార్డును నమోదు చేశారు. మూడు నుంచి అయిదో తరగతి విద్యార్థులు సూమారు 76 వేల మంది 214 వేదికలపై విరామం లేకుండా15 నిమిషాల పాటు 45 యోగాసనాలు ప్రదర్శించి మరో కొత్త రికార్డును సృష్టించారు. ఎలైట్​ వరల్డ్ రికార్డ్స్ (యూఎస్​ఏ) ఏసియన్ రికార్డ్ అకాడమీ(యూఏఈ) ఇండియా రికార్డ్స్ (భారత్) వీటిని ధృవీకరించాయి.విజయవాడలోని పటమట శ్రీ చైతన్య ఒలింపియాడ్ స్కూల్​లో బుధవారం ఇండియా రికార్డ్స్ అకాడమీ సీనియర్ మేనేజర్ డాక్టర్ ఎస్. యశ్వంత్ సాయి ప్రపంచ రికార్డు ధ్రువీకరణ పత్రాలను విద్యాసంస్థల ప్రాంతీయ బాధ్యురాలు స్కూల్ ప్రిన్సిపల్ రావి పద్మకు అందించారు.

శ్రీచైతన్య విద్యాసంస్థల...ఫిట్ ఇండియా ప్రపంచ రికార్డులు కైవసం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details