కృష్ణాజిల్లాలోని గంపలగూడెంలోని నెమలి శ్రీ వేణుగోపాల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి కల్యాణోత్సవాన్ని వైభవంగా జరిపించారు. ఆలయ అర్చకుల వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా కార్యక్రమం నిర్వహించారు. నల్లనయ్య కల్యాణాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
గంపలగూడెంలో నెమలి శ్రీ వేణుగోపాల స్వామి కల్యాణోత్సవం - sri venugopala swamy kalyanostavam news
కృష్ణాజిల్లా గంపలగూడెం మండలం నెమలి శ్రీ వేణుగోపాల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామి వారి కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు.

శ్రీ వేణుగోపాల స్వామి కల్యాణోత్సవం