కార్తికమాసం పర్వదిన వేడుకలను పురస్కరించుకొని పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తిరుపతమ్మ, గోపయ్య స్వాములతో పాటు ఆలయంలోని సహదేవతామూర్తులను పలురకాల ఫలాలతో అలంకరించారు. పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కరోనా నిబంధనలు పాటించేలా ఆలయాధికారులు ఏర్పాట్లు చేశారు.
తిరుపతమ్మ తల్లికి ఫలాలతో ప్రత్యేక అలంకరణ - Sri Tirupatamma Ammavaru temple news
కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో దేవతామూర్తులను ఫలాలతో ప్రత్యేకంగా అలంకరించారు. కార్తిక మాసం వేడుకల్లో భాగంగా విశేష పూజలు చేశారు.
![తిరుపతమ్మ తల్లికి ఫలాలతో ప్రత్యేక అలంకరణ special decoration with fruits](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9863080-386-9863080-1607849346735.jpg)
ఫలాలతో ప్రత్యేక అలంకరణలో శ్రీ తిరుపతమ్మ అమ్మవారు