ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సరస్వతీ దేవిగా.. దుర్గమ్మ దర్శనం - విజయవాడలో వసంతపంచమి వేడుకలు తాజా వార్తలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీపంచమి మహోత్సవాలు ఘనంగా జరిపారు. అమ్మవారు సరస్వతిదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.

sri panchami celebrations at vijayawada durga temple in krishna
సర్వతీ దేవిగా.. దుర్గమ్మ దర్శనం

By

Published : Jan 30, 2020, 8:29 PM IST

Updated : Jan 30, 2020, 9:44 PM IST

సర్వతీ దేవిగా.. దుర్గమ్మ దర్శనం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో శ్రీపంచమి మహోత్సవాలు వైభవంగా సాగాయి. శ్రీపంచమి సందర్భంగా కనకదుర్గమ్మ.. సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. సరస్వతి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు నగరంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దసరా ఉత్సవాల తర్వాత.. మళ్లీ శ్రీపంచమి రోజే కనకదుర్గమ్మ సరస్వతి దేవి అలంకారంలో దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. సరస్వతీ దేవిగా అమ్మవారిని దర్శించుకుంటే విద్యారంగంలో రాణించవచ్చనే నమ్మకంతో పెద్ద ఎత్తున విద్యార్థులు దుర్గమ్మ దర్శనం కోసం వచ్చారు. ఆలయంలోని యాగశాలలో ప్రత్యేకంగా సరస్వతి యాగం నిర్వహించారు. విద్యార్థులకు అమ్మవారి పూజలో ఉంచిన పెన్ను, కుంకుమ, కంకణాలను ప్రసాదంగా అందించారు.

Last Updated : Jan 30, 2020, 9:44 PM IST

ABOUT THE AUTHOR

...view details