కేంద్ర మాజీ మంత్రి, భాజపా ఎంపీ సుజనా చౌదరికి విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో అనుచరులు ఘనస్వాగతం పలికారు. సుజనా రాకను పురస్కరించుకుని గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడ నగరంలో ప్రధాన కూడళ్ల వరకు దారి పొడవునా స్వాగత ఫ్లెక్సిలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సీనియర్ ఎన్టీఆర్ చిత్రాలను కూడా ముద్రించడం చర్చనీయాంశమైంది. విజయవాడలో శ్రేయోభిలాషులు, భాజపా నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో సుజనా ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
భాజపా ఫ్లెక్సీలపై ఎన్టీఆర్.. ఈ చిత్రం చూశారా? - సుజనా చౌదరి
తెలుగుదేశం నుంచి భారతీయ జనతా పార్టీ లోకి చేరిన తరువాత మొదటిసారిగా కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి కృష్ణా జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ చిత్రాలు ఉండడం... చర్చనీయాశమైంది.
ఫ్లెక్సీలపై ఎన్టీఆర్, మోదీ చిత్రాలు... గన్నవరంలో సుజనాకు ఘనస్వాగతం పలికిన అభిమానులు