విజయవాడ నగర వ్యాప్తంగా సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు అగ్నిమాపక సిబ్బంది సహకారంతో ఈ ద్రావణాన్ని స్ర్పే చేస్తున్నారు. ఇప్పటికే నగరంలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం... పదుల సంఖ్యలో అనుమానితుల నమూనాలను ప్రయోగశాలకు పంపించిన తరుణంలో అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచి... వైరస్ వ్యాప్తి నిరోధానికి అవసరమైన చర్యలు చేపడుతున్నారు.
విజయవాడలో హైపోక్లోరైట్ ద్రావణం పిచికారి - lock down detailes in vijayawada
విజయవాడ నగరంలో ఇప్పటికే మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. నగర వ్యాప్తంగా హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేస్తున్నారు.
విజయవాడలో హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి