ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా మృతులకు అంత్యక్రియలు... ఎస్పీ అభినందనలు - machilipatnam latest news

కరోనా ధాటికి మానవ సంబంధాలు మంటగలిసి పోతున్నాయి. కొవిడ్​ సోకిన వారిని.. వారి కుటుంబ సభ్యులను చాలామంది వెలివేస్తున్నట్టుగా చూస్తున్నారు. బాధితులకు సహాయం చేసినా.. వైరస్​ అంటుకుంటుందేమో అని భయపడుతున్నారు. ఇక కరోనాతో మృతి చెందిన వారి గురించి చెప్పనక్కర్లేదు. ఇంతటి విపత్కర పరిస్ధితుల్లో సాటి మనిషిగా... వైరస్​ బారిన పడి మరణించిన వారికి అంత్యక్రియలు నిర్వహిస్తుందో మిత్రబృందం. వారు చేసే మంచి పనిని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్​బాబు అభినందించారు.

Breaking News

By

Published : May 10, 2021, 4:04 PM IST

కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన విజయ్​, సయ్యద్​ ఖాజా.. అతని మిత్రబృందం కరోనా సోకి మరణించిన వారికి అంత్యక్రియలు నిర్వహిస్తోంది. కరోనా వైరస్ ప్రాణాంతకమేమీ కాదని మన భయమే మన శత్రువు అని, ప్రజలందరికీ అవగాహన కల్పిస్తున్నారు ఆ మిత్రులు. ఇప్పటికే విజయ్… 19 మృతదేహాలకు దహన సంస్కారాలు చేయించారు.

ఖాజా మిత్రబృందం గతేడాది నుంచి ఇప్పటివరకు సుమారు 80కి పైగా మృతదేహాలకు అంతిమ సంస్కారాలు చేయించారు. మానవత్వంతో వారు చేసిన సేవలను.. పోలీస్ శాఖ తరపున జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు అభినందించారు. వారి సేవలు కొనసాగిస్తూ పలువురికి ఆదర్శంగా నిలవాలని కాంక్షిస్తూ.. వారిని సత్కరించారు.

ABOUT THE AUTHOR

...view details