ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంక్రాంతి సందర్భంగా పోలీసులకు క్రీడా పోటీలు - పోలీసులకు ఆటల పోటీలు వార్తలు

సంక్రాంతి పండుగ సందర్బంగా.. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోలీసులకు క్రీడా పోటీలు నిర్వహించారు. నిత్యం తీరిక లేకుండా గడిపే పోలీసులకు.. ఇలా పోటీలు నిర్వహించటంతో మానసికోల్లాసం లభిస్తుందని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు.

sports held for police on occassion of sankranthi festival
సంక్రాంతి సందర్భంగా పోలీసులకు క్రీడా పోటీలు

By

Published : Jan 10, 2021, 3:40 PM IST

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో.. పోలీసులు సంక్రాంతి సంబరాలు జరుపుకొన్నారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు పోలీస్ డిపార్ట్​మెంట్ ఆధ్వర్యంలో.. సంక్రాంతి సందర్భంగా వాలీబాల్ పోటీలు నిర్వహించారు. వృత్తిలో నిత్యం బీజీగా గడిపే పోలీసులకు.. సంక్రాంతి పండగకు క్రీడలు నిర్వహించడం ద్వారా మానాసికోల్లాసం లభిస్తుందని అధికారులు తెలిపారు. కోడి పందాలు, పేకాట, పలు జూదపు ఆటలకు యువత ఆకర్షితులవ్వకుండా ఉండేందుకు ఈ పోటీలు దోహదపడతాయని ఎస్పీ తెలిపారు. మచిలీపట్నం పోలీస్ పరేడ్ గ్రౌండ్​లో సంక్రాంతి క్రీడా పోటీలు రెండు రోజుల పాటు జరగనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details