వైకాపాలోకి దేవినేని అవినాష్?.. విజయవాడ తూర్పుపై గురి - వైకాపాలోకి దేవినేని అవినాష్
తెదేపా యువ నాయకుడు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వైకాపా కండువా కప్పుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం.

devineni avinash
తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ వైకాపాలోకి చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. బుధవారం విజయవాడలోని ఆయన నివాసంలో అనుచరులతో సమావేశం నిర్వహించారు. ఇవాళ ముఖ్యమంత్రి జగన్ను కలిసి నిర్ణయం తెలుపనున్నారు. పార్టీ మారనున్న విషయాన్ని ఆయన ముఖ్య అనుచరుడు, మాజీ కార్పొరేటర్ కడియాల బుచ్చిబాబు 'ఈనాడు'తో చెప్పారు. అవినాష్ మాజీ మంత్రి, దివంగత దేవినేని నెహ్రు తనయుడు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నట్లు తెలిసింది.
Last Updated : Nov 14, 2019, 6:29 AM IST