కరోనా బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ ఆయన అభిమానులు పూజులు నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా ఘంటసాల జలదీశ్వరాలయంలో ఎస్పీ బాలు పేరు మీద అర్చనలు, అభిషేకాలు చేశారు. చెన్నైలోని ఘంటసాల వెంకటేశ్వరరావు కుటుంబసభ్యుల కోరిక మేరకు శివాలయాల్లో పూజాదికాలు నిర్వహించారు. మహమ్మారి బారి నుంచి త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తిరిగి రావాలని కోరుకున్నారు.
ఎస్పీ బాలు కోలుకోవాలంటూ అర్చనలు, అభిషేకాలు - ఘంటసాలలో ఎస్పీ బాలు కోసం పూజలు
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలంటూ కృష్ణా జిల్లా ఘంటసాల ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కరోనా బారి నుంచి కోలుకుని క్షేమంగా తిరిగి రావాలంటూ ఆకాంక్షించారు.
![ఎస్పీ బాలు కోలుకోవాలంటూ అర్చనలు, అభిషేకాలు special worships for sp balasubrahamanyam in gantasala krishna district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8574845-424-8574845-1598513518634.jpg)
ఎస్పీబీ కోలుకోవాలంటూ అర్చనలు, అభిషేకాల నిర్వహణ