ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని విజయవాడలోని దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం యాగశాలలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ బాబు పర్యవేక్షణలో ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ ఆధ్వర్యంలో పూజలు చేస్తున్నారు. వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు శ్రీ కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చన చేశారు. లాక్డౌన్ పరిస్థితుల్లో నగరంలో ఆహారం అందక ఇబ్బందులు పడుతున్న యాచకులు, పేదలకు దేవస్థానం తరఫున ఆహార ప్యాకెట్లు అందించారు.
ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక పూజలు
కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజల ఆరోగ్యంగా ఉండాలని విజయవాడలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. లాక్డౌన్ సందర్భంగా ఆహారం అందక ఇబ్బందులు పడుతున్న యాచకులు, పేదలకు దేవస్థానం సిబ్బంది ఆహారం అందించారు.
దేశ ప్రజల ఆరోగ్య సంక్షేమానికి విజయవాడలో ప్రత్యేక పూజలు