ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు - తిరుపతి బ్రహ్మోత్సవాలకు దక్షిణ మధ్య నుంచి ప్రత్యేక రైళ్లు

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. పదిరోజుల పాటు ఈ రైళ్లు నడుపుతున్నట్టు అధికారులు వెల్లడించారు.

తిరుపతి బ్రహ్మోత్సవాలకు దక్షిణ మధ్య నుంచి ప్రత్యేక రైళ్లు

By

Published : Sep 25, 2019, 5:04 AM IST

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని అధికారులు వెల్లడించారు. అరక్కోణం-రేణిగుంట-చెన్నయ్ బీచ్​ల మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. పదిరోజులపాటు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని రైల్వేశాఖ కోరింది. పుత్తూరు, ఏకాంబరాపురం, తిరుత్తని, అరక్కోణం, తిరువళ్లూర్, పెరుంబుర్ స్టేషన్లలో కూడా ఈ రైళ్లు ఆపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details