మిర్చి సేంద్రీయ సాగులో రాణిస్తున్న రైతు నాగేశ్వరరావు Organic chilli farming in krishna district: ఈయన పేరు కర్ల నాగేశ్వరరావు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలుకు చెందిన ఈ రైతు.. కొన్నేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. సేంద్రీయ పద్ధతిలో మిరపను పండిస్తున్నారు. సంప్రదాయ పద్ధతిలో మిర్చి సాగు చేస్తున్న రైతుల కంటే నాణ్యమైన దిగుబడిని నాగేశ్వరరావు పొందుతున్నారు. కేవలం వ్యవసాయం పైనే ఆధారపడకుండా పంట చేతికి అందిన తర్వాత మిరపకాయలను విక్రయిస్తున్నారు. సొంతంగా మిల్లు ఏర్పాటు చేసుకుని కారపు పొడిని అమ్ముతూ.. మంచి ధర పొందుతున్నారు.
నాణ్యమైన దిగుబడితో మంచి లాభాలు..
ప్రస్తుత పరిస్థితుల్లో రైతు...కేవలం రైతుగానే ఉండి పోతే ఆర్థిక బాధలు తప్పవంటున్నారు నాగేశ్వరరావు. సేంద్రియ సాగులో మిర్చి పండిస్తోన్న తనకు దిగుబడి భారీగా రాకపోయినా... ఆరోగ్యమైన క్రిమిసంహారక రసాయన రహిత పంటతో ధర మెరుగ్గానే వస్తోందని చెబుతున్నారు. ఈ మిర్చితోనే... పండు మిరప, ఆవకాయ, గోంగూర, నిమ్మ, చింతకాయ, టమోట పచ్చళ్లను కుటుంబ సభ్యుల సహకారంతో చేయించి విక్రయిస్తున్నారు. జిల్లా వ్యవసాయ అధికారులు రైతు నాగేశ్వరరావు ఆలోచనను అభినందిస్తున్నారు. విలువ ఆధారితంగా ముందుడుగు వేస్తుండడాన్ని ప్రత్యక్షంగా చూసి ప్రశంసిస్తున్నారు.
ఇదీ చదవండి...
Head master punishment: తల్లిముందే విద్యార్థినిని చితకబాదిన ప్రధానోపాధ్యాయురాలు