ప్రకాశం బ్యారేజీ నుంచి కాలువలకు నీరు విడుదలతో కృష్ణా జిల్లావ్యాప్తంగా నాట్లు జోరుగా సాగుతున్నాయి. ముందస్తుగా నారు పోసిన రైతులంతా ఇప్పటికే వరినాట్లు వేయగా.. జిల్లాలో పలు నియోజకవర్గాల్లో నాట్లు కొనసాగుతున్నాయి. ఎప్పటిలాగే కోటి ఆశలతో రైతన్నలు ఖరీఫ్ సాగు ప్రారంభించినా... గడిచిన కొన్నేళ్లుగా కృష్ణా జిల్లా రైతులను సమస్యలు కంటనీరు పెట్టిస్తున్నాయి. కరోనాతో ఈ ఏడాది కూలీల కొరత ఎక్కువవడంతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వీరి కష్టాలకు కారణమవుతున్నాయి. దీంతో పెట్టుబడులు భారంగా మారాయని రైతులు వాపోతున్నారు.
కళ్లు కాయలు కాచేలా ఎదురుచూపు
గతేడాది పండించిన ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వానికి అమ్మిన రైతులు... డబ్బుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. పంటల సాగుకు ముందే డబ్బు చేతికి వస్తే విత్తనాలు, ఎరువుల కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి రాకపోయేది. కానీ సకాలంలో నిధులు రాకపోవడంతో నిరాశే మిగిలింది. నాట్ల సమయం మించిపోతుందని భావించి పెట్టుబడుల కోసం వడ్డీకి అప్పు తెచ్చి సాగు చేస్తున్నామని అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
అందని ద్రాక్షగానే గిట్టుబాటు ధర