ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎండు చేపలు, రొయ్యలకు కేరాఫ్ అడ్రస్.. దివిసీమ..! - ఎండు చేపలు

ఆదివారం వచ్చిందంటే మాంసాహార ప్రియులు చేపల కూర కోసం తహతహలాడతారు. కొందరు పచ్చిచేపలను ఇష్టపడతారు. మరికొందరు ఎండు చేపలు, ఉప్పు చేపలను ఇష్టపడుతుంటారు. ఉప్పు, ఎండు చేపల్లో చాలా రకాల విటమిన్లు పోషక విలువలు ఉంటాయని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. దివిసీమలో దొరికే పెద్దపెద్ద ఉప్పుచేపల వివరాలు తెలుసుకుందామా..

special story on diviseema fishes and prawns
ఎండు చేపలు, రొయ్యలు విటమిన్ల ఘని.. వీటికి దివిసీమ ప్రసిద్ధి

By

Published : Feb 28, 2021, 4:59 PM IST

Updated : Feb 28, 2021, 9:10 PM IST

ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం నాగాయలంక గ్రామంలోని చేపల మార్కెట్.. ఉప్పు చేపలు, ఎండుచేపలు, రొయ్యలకు ఎంతగానో ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో ఎక్కువమంది మత్స్యకారులు ఉండటం.. సముద్రతీరం, కృష్ణా నది పాయలు ఎక్కువ కిలోమీటర్లు ఉండటం వల్ల తక్కువ ధరకే నాణ్యమైన చేపలు, రొయ్యలు ఇక్కడ లభిస్తుంటాయి.

ఎండు చేపలు, రొయ్యలకు కేరాఫ్ అడ్రస్.. దివిసీమ..!

సౌకర్యాల లేమితో వైభవం కోల్పోయిన మార్కెట్​..

ఇక్కడి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకే కాకుండా విదేశాలకు సైతం ఎండు చేపలు, రొయ్యలు ఎగుమతి చేస్తుంటారు. నాగాయలంక సంతలో సరైన సౌకర్యాలు లేకపోవడం.. సమస్యలు పెరిగిపోవడం వల్ల అమ్ముకునే మత్స్యకారులు, కొనుగోలుదారులు లేకపోవడంతో ఉప్పుచేపల మార్కెట్ గత వైభవాన్ని కోల్పోతుంది. ప్రస్తుతం కరకట్ట రోడ్డు మార్గం అమ్మకాలకు అనువుగా మారుతోంది.

ఎండు చేపలు కొనేందుకే మక్కువ..

విజయవాడ నుంచి అవనిగడ్డ వెళ్లే కృష్ణా నది ఎడమ కరకట్టపై చల్లపల్లి మండలం, నడకుదురు, మోపిదేవి వార్పూ వద్ద ఎండు చేపలు, రొయ్యలు, రొయ్య పప్పు అమ్మే దుకాణాలు పెరిగిపోయాయి. నడకుదురు వద్ద సుమారు వంద కేజీల ఉప్పు చేపలను చూసిన వాహనదారులు మొబైల్ ఫోన్​లతో సెల్ఫీలు దిగుతున్నారు. ఇక్కడి పెద్దపెద్ద చేపలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. వివిధ రకాల ఎండు చేపలు, రొయ్యలు అమ్ముతున్నామని.. చేపల ప్రియులు తమ వద్ద కొనేందుకు బాగా వస్తున్నారని షాపు యజమాని చెబుతున్నారు. పచ్చి చేపల కన్నా ఎండు చేపలపై ఎక్కువ మక్కువ చూపిస్తున్నట్లు పేర్కొన్నాడు.

ఉపయోగాలెన్నో...

ఉప్పు చేపలు, ఎండు చేపల్లో అపారమైన ప్రోటీన్ల శాతం ఎక్కువగా ఉంటాయని మత్స్య శాఖ అధికారులు చెబుతున్నారు. విటమిన్​ ఎ, డి, ఈ వీటిలో పుష్కలంగా లభిస్తాయని తెలిపారు. అరుగుదల ఎక్కువగా ఉంటూ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయని.. అదే సమయంలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటూ మంచి ఆరోగ్యాన్నిస్తాయని అంటున్నారు. అన్ని వయసుల వారు తినటానికి, సుదూరాలకు సైతం సులువుగా రవాణా చేసేందుకు అనువుగా ఉంటాయని మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ డా.పి. సురేష్ తెలిపారు.

ఇదీ చదవండి:

జాబితాలు తారుమారు.. డివిజన్లు దాటిన ఓటర్లు

Last Updated : Feb 28, 2021, 9:10 PM IST

ABOUT THE AUTHOR

...view details