ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డే లక్ష్యంగా... పరిశోధనలు

వాడి పడేసిన వస్తువులే ఆ యవకుడి పరిశోధనలకు సామగ్రి. సాంకేతికతపై మక్కువతో సరికొత్త ఆవిష్కరణలకు ఊపిరిపోస్తూ రికార్డులు సొంతం చేసుకుంటున్నాడు. గుప్పిట్లో పట్టేంత మైక్రోవేవ్ ఓవన్​తో ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్న ఆ యువకుడు... చిటికిన వేలంత లేని వ్యాక్యూమ్ క్లీనర్​తో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు కోసం ప్రయత్నిస్తున్నాడు. పర్యావరణహిత ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీకి ఊపిరిపోస్తున్న కృష్ణాజిల్లాకు చెందిన సల్వీందర్​పై ప్రత్యేక కథనం.

గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డే లక్ష్యంగా... పరిశోధనలు

By

Published : May 20, 2019, 9:44 AM IST

గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డే లక్ష్యంగా... పరిశోధనలు

సల్వీందర్​కు ఎలక్ట్రానిక్‌ వస్తువులంటే మహా ఇష్టం. ఆ ఇష్టమే పాడైపోయిన బ్యాటరీలతో పవర్ బ్యాంక్ తయారు చేసేలా చేసింది. ఆ ఆసక్తే... ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్​లో చేరేలా ప్రేరేపించింది. ఇస్రో శాస్త్రవేత్త కావాలనే లక్ష్యంతోనే ఇంజనీరింగ్ ఎంచుకున్న సల్వీందర్... ప్రస్తుతం ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పాడైపోయిన బ్యాటరీలతో పవర్ బ్యాంక్ చేసిన తర్వాత... సల్వీందర్ దృష్టి ఈ వ్యర్థాలపై పడింది. వాటిని తిరిగి ఎందుకు వినియోగించకూడదు అనుకున్నాడు. ఖాళీ సమాయాల్లో వాటిని సేకరించి... కొత్త ఆవిష్కరణలు చేయడం అలవాటుగా మార్చుకున్నాడు.

అలా చేసినవే ఈ బుల్లి మైక్రోవేవ్ ఓవెన్, చిట్టి వ్యాక్యూమ్ క్లీనర్. తనకు ఎదైనా ఆసక్తిగా అనిపిస్తే దాని గురించి పూర్తిగా తెలుసుకునే వరకు విశ్రమించడు సెల్వీందర్. ఈ బుల్లి మైక్రో వేవ్ ఓవన్ తయారీ కోసం సెల్వీందర్ 2నెలలు కష్టపడ్డాడు. ఈ సూక్ష్మ పరికరాన్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించి సల్వీందర్​ను గోల్డ్ మెడల్​తో సత్కరించింది. ఈ రికార్డు ఆనందాన్ని ఆస్వాదించిన సల్వీందర్... ఇప్పుడు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు కోసం ప్రయత్నిస్తున్నాడు. ప్రపంచంలో అతి చిన్న వ్యాక్యూమ్ క్లీనర్ రూపొందించాడు. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో అతి చిన్న వ్యాక్యూమ్ క్లీనర్ గా 5.6 సెంటీమీటర్ల పరికరం ఉండగా...సల్వీందర్ 3.6సెంటీమీటర్లతో ఈ వ్యాక్యూమ్ క్లీనర్ సిద్ధం చేశాడు.

స్మార్ట్ ఫోన్ పట్టుకుంటే చాలు... సోషల్ మీడియా... చాటింగ్​లంటూ విలువైన సమయాన్ని వృథా చేస్తున్న యువత చాలా మందే ఉన్నారు. అలాంటి వాళ్లందరికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాడు సల్వీందర్. 18ఏళ్లకే ఇంతటి ఘనత సాధించిన సల్వీందర్... భవిష్యత్తులో అనుకున్నవన్నీ సాధించాలని ఆశిద్దాం.

ఇదీ చదవండి...

ఈ బుడ్డోడు.. ఫుట్​బాల్​ ఆటలో గట్టోడు..!

ABOUT THE AUTHOR

...view details