కృష్ణాజిల్లా మోపిదేవి గ్రామంలో ఉన్న శ్రీవల్లీ, దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్రోత్సవ సహిత ఆషాడ కృత్తిక మహోత్సవంలో భాగంగా... గోపూజ, సుప్రభాత సేవ, అభిషేక జల సంగ్రహణం, ఆలయ ప్రదక్షిణ, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, రుత్విగ్వరణ, పంచగవ్యప్రాశన, అఖండ స్థాపన, వాస్తు మండపారాధన, సుబ్రహ్మణ్య మూల మంత్ర అనుష్ఠానం, మహానివేదన, నీరాజన మంత్రపుష్పముల పూజలు నిర్వహించారు.
- అన్లైన్ పూజలకు అవకాశం...
ఈ నెల 16న శ్రీ స్వామివారి ఆలయంలో జరిగే ప్రత్యేక మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, అష్టోత్తర కలశాభిషేకములలో... భక్తులు పరోక్షంగా పాల్గొనవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల వివరాలు గోత్రనామాలు, ఈమెయిల్ ద్వారా (ssstemplemopidevi@gmail.com) తెలియజేయాలని కార్యనిర్వహణాధికారి లీలాకుమార్ తెలిపారు.