గర్భిణీలకు మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేక అత్యవసర విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. గర్భిణీగా నమోదైన వారికి పోషకాహారం అందేలా చూడాలని అంగన్వాడీ, ఐసీడీఎస్ సిబ్బందికి సూచించారు. వారిలో రక్తహీనత తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ ద్వారా గర్భిణీలను ప్రతినెలా 9వ తేదీన వైద్యురాలి వద్దకు తీసుకెళ్లాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో శిశు మరణాలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
'మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు ప్రత్యేక ఐసీయూ' - మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రి తాజా సమాచారం
మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భీణీలకు అత్యవసర విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. వారిలో రక్తహీనతను తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.
'మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు ప్రత్యేక ఐసీయూ'