స్పెషల్ డీఎస్సీ రుసుము చెల్లింపు గడువు పెంపు - school assistants
ప్రత్యేక పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి విడుదలైన నోటిఫికేషన్ రుసుము చెల్లింపు గడువు పెంచినట్లు పాఠశాల విద్యాకమిషనర్ సంధ్యారాణి తెలిపారు.
స్పెషల్ డీఎస్సీ ఫీజు
స్పెషల్ డీఎస్సీ 2019 ప్రత్యేక పాఠశాలలో పోస్టుల పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగించినట్లు పాఠశాల విద్యా కమిషనర్ సంధ్యారాణి తెలిపారు. స్కూలు అసిస్టెంట్ పోస్టుల ఫీజు చెల్లింపు గడువును మార్చి 21వ తేదీ వరకు పెంచిమన్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈనెల 22వ తేదీలోపు సమర్పించాలని సూచించారు. అభ్యర్థులు విజ్ఞప్తి మేరకు గడువు పెంచామని కమిషనర్ వెల్లడించారు.