పోలవరం ప్రాజెక్టు భద్రత కోసం నియమించిన ఎస్పీఎఫ్ భద్రతా సిబ్బందికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కోసం.. ప్రాజెక్టు వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు కోటీ 17లక్షల రూపాయలను విడుదల చేస్తూ.. జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులిచ్చారు. ప్రాజెక్టు భద్రత కోసం ఇప్పటికే సాయుధ ఎస్పీఎఫ్ ను మోహరించిన రాష్ట్ర ప్రభుత్వం.. వారి కోసం ప్రాజెక్టు వద్ద వివిధ నిర్మాణాలు, బారక్ ఏర్పాటుకు ఈ నిధులు వెచ్చించనుంది.
పోలవరం వద్ద ఎస్‌పీఎఫ్ భద్రతా సిబ్బందికి ప్రత్యేక ఏర్పాట్లు - ap latest news
పోలవరం వద్ద ఎస్‌పీఎఫ్ భద్రతా సిబ్బందికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం. ఇందుకోసం రూ. 1.17 కోట్లు విడుదల చేసింది. ప్రాజెక్టు వద్ద బారక్ సహా వివిధ నిర్మాణాలకు నిధుల వినియోగించనుంది.
SPF security personnel at Polavaram in ap