కరోనా నివారణ చర్యల్లో భాగంగా గుడివాడలో అమలు చేస్తున్న కర్ఫ్యూను కృష్ణాజిల్లా ఎస్పీ రవీంద్రబాబు పరిశీలించారు. పలు సెంటర్లను సందర్శించి పోలీసులకు, అధికారులకు తగు సూచనలు చేశారు. నిర్లక్ష్యపూరితంగా రోడ్లపై సంచరిస్తున్న వారిని నిలువరించాలని తెలిపారు. అలా సంచరిస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ప్రకారం నిత్యావసర వాహనాలకు, గూడ్స్ వాహనాలకు, అంబులెన్స్లకు మాత్రమే అనుమతి ఉందని అన్నారు.
గుడివాడలో కర్ఫ్యూను పరిశీలించిన ఎస్పీ రవీంద్రబాబు - కృష్ణాజిల్లా తాజా వార్తలు
కృష్ణాజిల్లా గుడివాడలో కర్ఫ్యూను ఎస్పీ రవీంద్రబాబు పరిశీలించారు. పలు సెంటర్లను పరిశీలించి పోలీసులకు తగు సూచనలు చేశారు.
![గుడివాడలో కర్ఫ్యూను పరిశీలించిన ఎస్పీ రవీంద్రబాబు గుడివాడలో కర్ఫ్యూను పరిశీలించిన ఎస్పీ రవీంద్రబాబు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11920220-486-11920220-1622116324963.jpg)
గుడివాడలో కర్ఫ్యూను పరిశీలించిన ఎస్పీ రవీంద్రబాబు