ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైళ్లలో మహిళల రక్షణకు 'మేరీ సహేలీ' - ఆపరేషన్ మేరీ సహేలీ వార్తలు

రైళ్లలో ప్రయాణించే మహిళల రక్షణ కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. మహిళల సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించడమే లక్ష్యంగా 'ఆపరేషన్ మేరీ సహేలీ(నా స్నేహితురాలు)' పేరుతో నూతన విధానానికి శ్రీకారం చుట్టారు రైల్వే అధికారులు. ఆడవారిని ఇబ్బంది పెట్టే ఆకతాయిలు సహా అనుమానితులను భద్రతా సిబ్బంది వెంటనే అదుపులోకి తీసుకుంటుంది.

meri saheli
meri saheli

By

Published : Nov 7, 2020, 6:18 PM IST

రైళ్లలో మహిళలు, యువతులపై ఆకతాయిలు, పోకిరీల వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు దక్షిణ మధ్య రైల్వే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రత్యేకించి ఒంటరిగా ప్రయాణించే మహిళల భద్రత కోసం 'మేరీ సహేలీ' పేరిట రక్షణ చర్యలు చేపట్టింది. రైలు ఎక్కినప్పటి నుంచి ప్రయాణం ముగిసేవరకూ మహిళలకు భద్రత, భరోసా ఉందనే విధంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రయాణించే 8 ప్రధాన రైళ్లను గుర్తించి...ఆర్పీఎఫ్ మహిళా పోలీసులను నియమించారు. మహిళా ప్రయాణికులను భద్రత రీత్యా చైతన్యవంతం చేసేందుకు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.

'మేరీ సహేలీ' కార్యక్రమంలో భాగంగా ప్రయాణం ప్రారంభమయ్యే స్టేషన్ల వద్ద రైల్వే భద్రతా దళం మహిళా ప్రయాణికులతో మాట్లాడతారు. ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలపై వివరిస్తారు. అత్యవసర సమయాల్లో 182 నెంబరుకు ఫోన్‌ చేసి సహాయం పొందాలని తెలియజేస్తారు. సహాయం కోరుతూ ఏదేని ఫోన్‌ వచ్చిన పక్షంలో భద్రతా సిబ్బంది అప్రమత్తమై క్షణాల్లో అక్కడకు చేరుకుంటారు. తక్షణ చర్యలు తీసుకోవటంతోపాటు మహిళా ప్రయాణికుల్లో భద్రతాపరమైన భరోసా నింపుతారు. ఇటువంటి చర్యల వల్ల రైళ్లలో భద్రతపై మహిళల్లో కూడా నమ్మకం పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details