ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్ర ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జీఎం భేటీ - రాష్ట్ర ఎంపీతో దక్షిణమధ్య రైల్వే జీఎం భేటీ

విజయవాడలో రాష్ట్ర ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా భేటీ అయ్యారు. తమ నియోజకవర్గ సమస్యలపై జీఎంకు ప్రతిపాదనలు ఇచ్చారు.

రాష్ట్ర ఎంపీతో దక్షిణమధ్య రైల్వే జీఎం భేటీ

By

Published : Sep 24, 2019, 12:29 PM IST

Updated : Sep 24, 2019, 9:17 PM IST

విజయవాడలో రాష్ట్ర ఎంపీలతో దక్షిణమధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా సమావేశమయ్యారు. రైల్వేల అభివృద్ధిపై జీఎంకు ఎంపీలు ప్రతిపాదనలు ఇచ్చారు. తమ నియోజకవర్గాల్లో సమస్యలపై ఎంపీలు ప్రతిపాదనలు రూపొందించారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రైల్వేప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలని ర కోరారు. ప్రయాణికులకు రద్దీ దృష్ట్యా కొత్త రైళ్లను నడపడం సహా స్టేషన్లలో సదుపాయాలు పెంచాలని తెలిపారు. రైల్వే బోర్డుపై ఒత్తిడి తెచ్చి వీలైనంత ఎక్కువగా నిధులు రాబట్టేలా చర్యలు తీసుకోవాలని దీనికి తామంతా సహకరిస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం ను కోరారు. తన పరిధిలోని సమస్యలను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన జీఎం.. మిగిలిన అంశాలపై కేంద్రానికి నివేదిస్తామన్నారు. వాల్తేరు డివిజన్ తో కలిపి విశాఖ కేంద్రంగా నూతన జోన్ ను ఏర్పాటు చేయాల్సిందేనని ఆ దిశగా రైల్వే బోర్డు, కేంద్రంపై ఒత్తిడి తేస్తామని రాష్ట్ర ఎంపీలు స్పష్టం చేశారు.

రాష్ట్ర ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జీఎం భేటీ
Last Updated : Sep 24, 2019, 9:17 PM IST

ABOUT THE AUTHOR

...view details