ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తల్లిని చేతులపై మోసుకెళ్లాడు... ఎందుకంటే... - తల్లికి అసరాగా తనయుడు

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లినీ మూత్రశాలకు తీసుకెళ్లే వారు లేక... రెండు చేతులపై తీసుకెళ్లి పెంచిన రుణం తీర్చుకున్నాడు ఓ కుమారుడు. ఈ సంఘటన పొద్దుటూరు ఆసుపత్రిలో జరిగింది.

mother
తల్లిని మూత్రశాలకు తీసుకెళ్తున్న తనయుడు

By

Published : Nov 27, 2019, 8:28 PM IST

ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు నాగ సుబ్బమ్మ. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం చిన్నదండ్లూరు స్వగ్రామం. మూడు రోజుల క్రితం ఇంటి వద్ద కింద పడింది. కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. పొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఎముకలు, శస్త్రచికిత్సల విభాగంలో చికిత్స పొందుతోంది. మల, మూత్ర విసర్జనకు వెళ్లాలని తొలుత ఆసుపత్రి సిబ్బందిని చక్రాల కుర్చీ కోసం సంప్రదించారు. స్పందన లేదు. తనయుడే... తల్లి తనకు భారం కాదని మరుగుదొడ్డికి చేతులపై తీసుకొని వెళ్ళాడు. కని పెంచిన తల్లి రుణం ఇలా తీర్చుకుంటున్నానని అతను తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details