ఆస్తి కోసం తన బావమరిది సాయంతో కన్నతండ్రినే కడతేర్చాడు ఓ కొడుకు. కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన బొర్రా మాణిక్యాలరావు.. అతని కొడుకు మధ్య ఆస్తి విషయంలో ఘర్షణ జరిగింది. గొడవ తీవ్రతరం కావటంతో... కుమారుడు తన బావమరిదితో కలిసి తండ్రిపై దాడి చేశాడు. ఈ ఘటనలో మాణిక్యాలరావు తలకు బలమైన గాయం అవ్వడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... మరొకరి కోసం గాలింపు చేపట్టారు.
కన్నకొడుకే యముడయ్యాడు..!! - మచిలీపట్నంలో తండ్రిని చంపిన కొడుకు వార్తలు
ఆస్తి కోసం ఓ సుపుత్రుడు కన్నతండ్రినే హతమార్చాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆస్తి కోసం కన్నతండ్రినే హతమార్చిన కొడుకు