కృష్ణా జిల్లా మైలవరం మండలం వెదురుబిడెంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో మామ కుటుంబంపై అల్లుడు దాడి చేశాడు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ...మామ కొండల్రావు మృతి చెందాడు. వెదురుబిడేనికి చెందిన కొండలరావుకు ముగ్గురు కుమార్తెలు. మొదటి కుమార్తె ధనలక్ష్మికి గన్నవరం మండలం బల్లిపర్రుకు చెందిన రాంబాబుతో నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లి సమయంలో ఇచ్చిన భూమిని విక్రయించాలని రోజూ భార్యతో రాంబాబు గొడవపెట్టుకుంటున్నాడు. భర్త వేధింపులు భరించలేని భార్య ధనలక్ష్మీ ఆదివారం పుట్టింటికి వచ్చింది. ఇవాళ తెల్లవారుజామున 4 గంటల సమయంలో మామ ఇంటికి వచ్చిన రాంబాబు… అక్కడ నిద్రిస్తున్న మామ కొండలరావు, అత్త రమణ, భార్య ధనలక్ష్మి, మరదలు భవానిపై కత్తితో దాడి చేశాడు. వెంటనే తేరుకున్న స్థానికులు తీవ్ర గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. కొండల్రావు చికిత్స పొందుతూ మృతి చెందాడు. అత్త, భార్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తున్నారు.
crime: అల్లుడి ఆగ్రహం.. మామ కుటుంబంపై కత్తితో దాడి.. - krishna district latest updates
కృష్ణాజిల్లా మైలవరం మండలంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో మామ కుటుంబంపై అల్లుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో మామ ప్రాణాలు కోల్పోయాడు. నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కుటుంబ కలహాలతో మామ ఇంటిపై దాడి చేసిన అల్లుడు
Last Updated : Oct 18, 2021, 10:01 AM IST