కృష్ణా జిల్లా నాగాయలంక మండలం ఎదురుమొండిలో దారుణం జరిగింది. కనిపెంచిన తల్లిదండ్రులపైనే గొడ్డలితో దాడి చేశాడు ఓ వ్యక్తి. ఘటనలో అతని తల్లి మరణించింది. స్థానికుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, వీరలంకమ్మ దంపతులపై వారి కుమారుడు వీరరాఘవయ్య గొడ్డలితో విచక్షణా రహితంగా దాడి చేశాడు.
దారుణం: కుమారుడి దాడిలో తల్లి మృతి - krishna district latest news

murder in krishna district
05:33 December 30
వీరలంకమ్మ మృతి చెందగా... నాగేశ్వరరావుకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. భార్యతో గొడవల కారణంగానే తల్లిదండ్రులపై కుమారుడు దాడి చేశాడని స్థానికులు చెబుతున్నారు. అవనిగడ్డ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
Last Updated : Dec 30, 2020, 7:02 AM IST