ధనంబొడులో దారుణం... ఆస్తి కోసం తండ్రినే హతమార్చారు - family murder latest news in jaggaiahpeta
కుటుంబంలో తలెత్తిన వివాదం చివరికి తండ్రి హత్యకు దారితీసింది. కన్నతండ్రి అని చూడకుండా... క్షణికావేశంలో గడ్డపారతో తలపై కొట్టారు. ఈ అమానుష ఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని ధనంబొడులో జరిగింది.
![ధనంబొడులో దారుణం... ఆస్తి కోసం తండ్రినే హతమార్చారు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5155097-244-5155097-1574510932668.jpg)
Son and daughter killed the father in krishna district
ధనంబొడులో దారుణం... ఆస్తి కోసం తండ్రినే హతమార్చారు
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని ధనంబొడులో దారుణం జరిగింది. కుటుంబ సభ్యులే... తండ్రిని తలమీద గడ్డపారతో కొట్టి హత్య చేశారు. ఆస్తి విషయమై నెలకొన్న వివాదంలో... క్షణికావేశంతో హత్య చేసినట్లు మృతుడి కుటుంబీకులు తెలిపారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన విజయకుమార్.. ఘటనా స్థలంలోనే మృతిచెందినట్లు పోలీసులు నిర్థరించారు. తామే ఈ హత్యకు పాల్పడినట్లు మృతుృడి కుమార్తె, అల్లుడు పోలీసులకు లొంగిపోగా... కుమారుడు పరారిలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.