ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆలయాలపై దాడులకు నిరసనగా శుక్రవారం చలో అమలాపురం' - విజయవాడలో భాజపా రక్తదాన శిబిరం

రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా శుక్రవారం చలో అమలాపురం కార్యక్రమం చేపడుతున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి హాజరైన ఆయన ఈ వివరాలు తెలిపారు.

somu veerraju
సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షులు

By

Published : Sep 17, 2020, 1:34 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా విజయవాడ చుట్టుగుంట లయన్స్ క్లబ్ ప్రాంగణంలో భాజపా ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హాజరయ్యారు. నిర్వహకులను అభినందించారు.

కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన సోమువీర్రాజు... రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా శుక్రవారం చలో అమలాపురం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దేవాలయాలపై దాడుల విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవసరిస్తోందనే విమర్శించారు. చలో అమలాపురం కార్యక్రమం ప్రకటించకముందే ఆయా జిల్లాల్లో వాలంటీర్లతో భాజపా శ్రేణుల వివరాలు సేకరించడం సరైంది కాదని సోము వీర్రాజు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details