ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రైతులవి గొంతెమ్మ కోర్కెలు కాదు... న్యాయపరమైన డిమాండ్లు' - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

ప్రధాన మంత్రి, హోంమంత్రి ఓ మెట్టు దిగి.. రైతుల న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. అన్నదాతలు గొంతెమ్మ కోర్కెలు కోరటం లేదని అన్నారు.

somireddy on delhi farmers agitation
సోమిరెడ్డి

By

Published : Jan 4, 2021, 12:30 PM IST

మార్కెటింగ్ వ్యవస్థను కొనసాగిస్తూ... మరింత పటిష్టం చేయాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమం 39 రోజులు దాటిందన్నారు. 8 డిగ్రీల ఉష్ణోగ్రత ఒకవైపు.. జోరున వర్షం మరోవైపు నిరసనలకు ఆటంకం కలిగిస్తున్నా... ప్రాణాలకు తెగించి రైతులు పోరాడుతున్నారన్నారు. రైతులు గొంతెమ్మ కోర్కెలు కోరటం లేదనీ... న్యాయపరమైన డిమాండ్లు తీర్చేందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్​షా ఓ మెట్టు దిగాలని కోరారు.

తెలుగు రాష్ట్రాల్లో 60 శాతం రైతులు మార్కెట్ యార్డుల ద్వారానే పంటను అమ్ముకుంటున్నారని గుర్తు చేశారు. పట్టింపులతో, మెుండితనంతో రైతులకు అన్యాయం చేస్తే... పరిస్థితులు దారుణంగా ఉంటాయని సోమిరెడ్డి హెచ్చరించారు.

ఇదీ చదవండి:శాస్త్రవేత్తలను చూసి దేశం గర్విస్తోంది: మోదీ

ABOUT THE AUTHOR

...view details