ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేసీఆర్ గారూ.. ఎన్టీఆర్​కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరండి: సోమిరెడ్డి - somireddy comments on bharataratna news

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరాలంటూ... తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అందుకు ఇదే సరైన సమయంగా చెప్పారు.

somireddy
somireddy

By

Published : Jun 29, 2020, 3:53 PM IST

తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ సీఎం ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరాలంటూ... తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్... కేసీఆర్​కు రాజకీయ గురువని ఆయన గుర్తు చేశారు. ఎన్టీఆర్ 100వ జయంతి వచ్చే లోవు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించాలని కోరారు.

ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కూడా స్పందించాలని కోరారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు కలిపి... ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచాలని విజ్ఞప్తి చేశారు. అందుకు ఇదే సరైస సమయం అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details