ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సీఎం తలకిందులుగా తపస్సు చేసినా రాజధాని మార్చలేరు' - అమరావతి తాజా వార్తలు

రాజధాని సమస్యను సృష్టించిందే వైకాపా ప్రభుత్వమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. మంచి పాలన అని మాయమాటలు చెప్పి వైకాపా అధికారంలో వచ్చిందని విమర్శించారు. శాంతియుతంగా రైతులు ధర్నా చేస్తుంటే... ఏదో జరిగిపోయినట్లు వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి హడావుడి చేస్తున్నారన్నారు. బోస్టన్ కమిటీ.. 5 కోట్ల ఆంధ్రులు భవిష్యత్తును 5 రోజుల్లో తేల్చేస్తుందా అని నిలదీశారు.

somireddy
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

By

Published : Jan 7, 2020, 6:22 PM IST

Updated : Jan 7, 2020, 7:53 PM IST

ప్రభుత్వంపై విమర్శలు చేస్తోన్న సోమిరెడ్డి చంద్రమోహన్​రెడ్డి
రాజధానిలో అలజడి సృష్టించిందే వైకాపా ప్రభుత్వమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. జగన్ మంచి పాలన అందిస్తారని అధికారం ఇస్తే.. రాష్ట్రాన్ని అంధకారంలోకి నెడుతున్నారని విమర్శించారు. శాంతియుతంగా రైతులు ఆందోళన చేస్తుంటే ఏదో జరిగినట్లు వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి మాట్లాడుతున్నారన్నారు. ఎమ్మెల్యే సెక్యూరిటీ సిబ్బంది రైతులపై దాడి చేసినందుకే పరిస్థితి ఉద్రిక్తంగా మారిందన్నారు. మంగళగిరి తెదేపా కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. 5 రోజుల్లో మూడు రాజధానులు చేయమని బోస్టన్ కమిటీ రిపోర్ట్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఈ కమిటీ ఐదు కోట్లమంది భవిష్యత్తు ఐదు రోజుల్లో తేల్చేస్తుందా.! అని నిలదీశారు. సీఎం జగన్ తలకిందులుగా తపస్సు చేసినా.. రాజధానిని మార్చలేరని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని సూచించారు.

కేంద్రం చూస్తూ ఊరుకోదు

ప్రధాని శంకుస్థాపన చేసి, రూ.2500 కోట్లు ఇచ్చిన రాజధాని తరలిస్తే.. కేంద్రం చూస్తూ ఊరుకోదని సోమిరెడ్డి అన్నారు. సీఎం జగన్​కు సలహాలిచ్చేందుకు సరైన మంత్రులే లేరా అని ప్రశ్నించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ సచివాలయం మార్చడానికి ప్రయత్నిస్తేనే అక్కడి హైకోర్టు అంగీకరించలేదని గుర్తుచేశారు. రాష్ట్రంలోనూ అదే పరిస్థితి వస్తుందన్నారు. ఉన్న 13 జిల్లాలకు మూడు కోర్టులు పెడతారా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. దేశంలో ఉన్న న్యాయవ్యవస్థ గురించి వైకాపా నేతలకు అసలు అవగాహన లేదని ఎద్దేవా చేశారు.

Last Updated : Jan 7, 2020, 7:53 PM IST

ABOUT THE AUTHOR

...view details