ఆర్టీసీ లైసెన్స్ పోర్టర్స్ ను4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి,ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని ఆర్టీసీ లైసెన్స్ పోర్టర్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు.రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లోని లైసెన్స్ పోర్టర్లు విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు.పోర్టర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని,పీఎఫ్,ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.డిపోల్లోని కార్మికులకు విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలన్నారు.
'ఆర్టీసీ లైసెన్స్ పోర్టర్ల సమస్యలు పరిష్కరించండి' - krishna district
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తోన్న లైసెన్స్ పోర్టర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లోని లైసెన్స్ పోర్టర్లు విజయవాడలో ధర్నా నిర్వహించారు. తమను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
'ఆర్టీసీ లైసెన్స్ పోర్టర్ల సమస్యలు పరిష్కరించరించండి'