ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరులైన పోలీసులకు ఘన నివాళులు - awareness programmes

పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా వివిధ జిల్లాలో అమరులైన పోలీసులకు నివాళులర్పిస్తూ కొవ్వుత్తుల ప్రదర్శనలు, ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

రాష్ట్రవ్యాప్తంగా అమరులైన పోలీసులకు ఘన నివాళులు

By

Published : Oct 21, 2019, 5:54 AM IST

తుపాకీల విధానంపై... విద్యార్థులకు అవగాహన
పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మూడవ బెటాలియన్ ఏపీఎస్పీ ప్రాంగణంలో గత వారం రోజులుగా ఓపెన్ హౌస్ నిర్వహిస్తున్నారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి పోలీసులు ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్​ను సందర్శనకు వచ్చిన విద్యార్థులకు పోలీసులు తుపాకీలను చూపిస్తూ అది వాడే తీరు పనిచేసే వైనాన్ని వివరించారు.
ఆటోలు,జీప్​లతో ర్యాలీలు...
పోలిస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు భాగంగా ముంచంగిపుట్టు మండల కేంద్రం లో స్థానికులు జీప్, ఆటో ల ర్యాలీ నిర్వహించారు.విధి నిర్వహణలో ప్రాణాలు పణంగా పెట్టి అసువులు బాసిన అమరులైన పోలీసులుకు నివాళులర్పించారు.
అలరించిన కళాకారుల నాటిక దృశ్యాలు
అనంతపురంలోని సప్తగిరి కూడలిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అమరవీరుల వారోత్సవాలను నిర్వహించారు. జిల్లాలో అమరులైన పోలీసుల సన్నివేశాలను నాటిక ద్వారా పోలీసులు, కళాకారులు ప్రదర్శించారు. పోలీసుల త్యాగాలపై చిన్నారుల పాటలు కళాకారులు చేసిన నాటిక దృశ్యాలు అలరించాయి. అనంతరం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో నగరంలో భారీ ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అమరవీరుల స్థూపానికి పోలీసులు నివాళులర్పించారు.

కొవ్వుత్తులతో ర్యాలీలు
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం లో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పట్టణంలో పోలీసులు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు పోలీస్ స్టేషన్ నుంచి బోసుబొమ్మ కూడలి వరకు ప్రదర్శన చేశారు అనంతరం ప్రధాన కూడలిలో మానవహారం చేశారు కార్యక్రమంలో ఆటో చోదకులు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు
ఉచిత వైద్యశిబిరం
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అనకాపల్లి సబ్ డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కంటి దంత వైద్య పరీక్షలతో పాటు ఎముకల శస్త్రచికిత్స నిపుణులు, జనరల్ ఫిజీషియన్ వైద్యులతో రోగులకు పరీక్షలు నిర్వహించారు అధిక సంఖ్యలో ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలతో పాటు అవసరమైనవారికి ఉచితంగా మందులు అందజేశారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కడప పోలీస్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎస్పీ అన్బురాజన్ పరిశీలించారు. వైద్య శిబిరానికి వచ్చిన రిటైర్డ్ పోలీసులను, పోలీసు సిబ్బందిని ఎస్పీ ఆప్యాయంగా పలకరించారు. మీకు ఎలాంటి వైద్యం అందించాలి, ఇంకా ఎలాంటి మందులు సరఫరా చేయాలని వారిని అడిగి తెలుసుకున్నారు. మందులను వెంటనే తెప్పించాలని సిబ్బందిని ఆదేశించారు.కడప అంబేద్కర్ కూడలి వద్ద పోలీసులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పోలీసులు విధుల నిర్వహణలో ప్రాణాలు కోల్పోయే విధానాన్ని నాటకాల రూపంలో చేసి చూపించారు.

రాష్ట్రవ్యాప్తంగా అమరులైన పోలీసులకు ఘన నివాళులు

ఇవీ చదవండి

సమాజ సేవలో పోలీసుల త్యాగాలకు వెలకట్టలేం: గవర్నర్

ABOUT THE AUTHOR

...view details