అంతర్జాతీయ ఇన్నర్ వీల్, నర్సుల దినోత్సవం సందర్భంగా వైద్యులు, నర్సులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో ఏర్పాటు చేశారు. కొవిడ్ కాలంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందించిన డాక్టర్లు, నర్సులకు సన్మానం చేశారు. ఇన్నర్ వీల్ వ్యవస్థాపకురాలు ఆలివర్ గోల్డింగ్కు ఆసుపత్రి సిబ్బంది నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర హాస్పిటల్ ప్రముఖ వైద్యులు డాక్టర్ రవీంద్రనాధ్, డాక్టర్ బి. సునీల్, క్లబ్ ఐఎన్ఓ డాక్టర్ రేవతి పాల్గొన్నారు.
ఆంధ్ర ఆసుపత్రిలో వైద్యులు, నర్సులకు ఘన సన్మానం.. - కృష్ణా తాజా సమాచారం
అంతర్జాతీయ ఇన్నర్ వీల్, నర్సుల దినోత్సవం సందర్భంగా విజయవాడ ఆంధ్ర ఆసుపత్రిలో వైద్యులు, నర్సులకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
నర్సుల దినోత్సవం సందర్భంగా వైద్యులు, నర్సులకు ఘన సన్మానం