విజయవాడలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్, సివిల్ పోలీసులు.. ప్రజల రక్షణలోనే కాదు కష్టాల్లో ఉన్నవారికి చేతనైన సాయం చేస్తూ కూడా శభాష్ అనిపించుకుంటున్నారు. సోల్జర్ ఫర్ చిల్డ్రన్ పోలీస్ టీం పేరుతో వాట్సాప్ గ్రూప్ నిర్వహిస్తున్నారు. ఇందులో నెలలో వచ్చే జీతంలో కొంత మొత్తాన్ని జమ చేసి.. అలా జమైన డబ్బును కష్టాల్లో ఉన్నవారికి అందిస్తున్నారు.
విజయవాడ పోలీసుల దాతృత్వం.. చెయ్యి కోల్పోయిన వ్యక్తికి ఆర్ధిక సాయం
అవసరమైన వారికి రక్షణ కల్పించటమే కాదు కష్టంలో ఉన్నవారికి చేయూతను కూడ అందిస్తున్నారు విజయవాడ పోలీసులు. సోల్జర్ ఫర్ పూర్ చిల్డ్రన్ టీం పేరుతో వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేసి, వచ్చే జీతంలో కొంత మొత్తాన్ని అందులో జమ చేస్తున్నారు నగరంలో వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్, సివిల్ పోలీసులు. జమైన మొత్తాన్ని సమాజ సేవకు వినియోగిస్తూ.. కష్టంలో ఉన్నవారికి చేతనైన సాయం చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు.
ఈక్రమంలో కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం కొణిజర్ల గ్రామానికి చెందిన ఈలవరపు ప్రవీణ్ కుమార్ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ జీవనం సాగిస్తున్నాడు. విధులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదఘాతానికి గురై ఎడమ చెయ్యి పోగుట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న సోల్జర్ ఫర్ పూర్ చిల్ట్రన్ పోలీస్ టీం తమ వంతు ఆర్ధిక సహాయం కింద 20 వేలు అందించారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని టూటౌన్ ట్రాఫిక్ ఎస్సై బేగ్, సిబ్బందితో కలిసి పరామర్శించి బాధితుడికి ఆర్ధిక సాయాన్ని అందజేశారు. విద్యుదాఘాతంతో చెయ్యి పోగొట్టుకోవటం తమను బాధించిందని.. అందుకే తమ వంతు సాయం అందించామని సోల్జర్ ఫర్ పూర్ చిల్డ్రన్ పోలీస్ టీం సభ్యులు తెలిపారు.
ఇవీ చూడండి...