ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాఠశాలలో సౌర విద్యుత్.. నెలవారీ​ బిల్లులకు చెక్!

ఒకప్పుడు రూపాయలు ఐదు వేలకు పైగా విద్యుత్ బిల్లులు చెల్లించే ఆ పాఠశాల నేడు దాదాపు 20 గదులకు సరిపడా విద్యుత్ వినియోగానికి ఒక్క రూపాయి కూడా చెల్లిచండం లేదు. అదెలా సాధ్యం అంటారా.! అంతేకాదు పాఠశాలకు సరిపడా కరెంట్ అందిన తర్వాత మిగిలిన దానిని బయట వినియోగానికి పంపిస్తారు. ఇదంతా ఎలా సాధ్యం అయ్యింది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనం తెలుసుకోవాల్సిందే.

kvr zphs school penuganchiprolu
కేవీఆర్ జిల్లా పరిషత్ పాఠశాల పెనుగంచిప్రోలు

By

Published : Feb 28, 2021, 12:43 PM IST

Updated : Feb 28, 2021, 1:55 PM IST

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులోని కేవీఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రకృతి నుంచి లభించే సూర్యరశ్మిని ఒడిసిపట్టి విద్యుత్ అవసరాలను తీర్చుకుంటోంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సహకారంతో సుమారు మూడు లక్షల రూపాయల విలువైన 4 సోలార్ ప్యానెల్​లు పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఒక్కో ప్యానల్ నుంచి రోజుకు నాలుగు యూనిట్లు చొప్పున మొత్తంగా 16 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.

ఈ సోలార్ యూనిట్​ను విద్యుత్ శాఖ గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. దీంతో పాఠశాల అవసరాలకు మించి ఉత్పత్తి అయిన కరెంట్ గ్రిడ్ ద్వారా బయటకు వెళుతుంది. ఒకవేళ ఉత్పత్తి తక్కువ అయితే దాన్ని తిరిగి పాఠశాలకు సరఫరా అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. పాఠశాలలో మొత్తం 650 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరి అవసరాలకు 20 తరగతి గదులు ఉన్నాయి. ప్రతి గదిలో ఐదు ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇవ్వన్నీ ఈ సౌర విద్యుత్ ద్వారానే పనిచేస్తున్నాయి.

సోలార్​తో విద్యుత్ బిల్లులకు చెక్​..

5 వేల రూపాయలు ఆదా..

గతంలో ఫ్యాన్లు, లైట్లు పరిమిత సంఖ్యలో ఉన్నప్పుడు నెలకు ఐదు వేలు విద్యుత్ బిల్లు చెల్లించే వారమని.. ప్రస్తుతం సోలార్ ప్యానల్ ఏర్పాటు ద్వారా విద్యుత్ బిల్లులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆళ్ల రాంబాబు తెలిపారు. సోలార్ ప్యానల్​కు పదేళ్ల వరకు ఎటువంటి నిర్వహణ ఖర్చులు ఉండవని.. తద్వారా పదేళ్లపాటు పాఠశాలకు విద్యుత్ బిల్లుల సమస్య ఉండదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ఒకేసారి.. 262 బ్రహ్మకమలాలు!

Last Updated : Feb 28, 2021, 1:55 PM IST

ABOUT THE AUTHOR

...view details