ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం.. యువ ఆవిష్కరణలకు ఊతం

సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఓ ఆలోచన జీవితాన్ని మార్చేయవచ్చు. మరెందరి జీవితాలనో తీర్చిదిద్దవచ్చు. మరి అలాంటి ఆలోచన ఏదైనా ఉందా? దానికి కార్యరూపం ఇస్తే ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారా? మరెందుకు ఆలస్యం? ప్రోత్సహించేందుకు మేం సిద్ధంగా ఉన్నామంటూ.... సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్కు ఆఫ్‌ ఇండియా (ఎస్టీపీఐ) ఆహ్వానం పలుకుతోంది. ఐటీకి చెందిన ఎలాంటి ఆలోచననైనా స్వాగతిస్తోంది. ఆ ఆలోచన నిపుణుల కమిటీ మెప్పు పొందితే... అది ఆవిష్కరణ దిశగా పయనించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్ధికంగా సాయం అందించబోతోంది. ఆత్మనిర్భర్ భారత్ వైపు ఒక ముఖ్యమైన ముందడుగు వేయించే లక్ష్యంతో... యువతకు అండగా నిలవాలని ఎస్టీపీఐ నిర్ణయించింది.

software-technology-park-of-india-startups-in-vijayawada
ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం.. యువ ఆవిష్కరణలకు ఊతం

By

Published : Aug 28, 2020, 5:38 PM IST

చైనాతో సరిహద్దు వివాదం రాజుకున్నాక... ఆ దేశానికి చెందిన యాప్‌లను మన దేశం నిషేదించింది. స్వదేశంలో... నెక్ట్స్‌జెన్‌ ఇంక్యుబేషన్‌ స్టార్టప్స్‌ అభివృద్ధికి ఊతమివ్వాలని సంకల్పించింది. తద్వారా ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యం వైపు ముందడుగు పడుతుందని భావిస్తోంది. దేశీయంగా ఐటీ రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టేందుకు... కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ అనేక విధానాలు తీసుకొచ్చింది. ఇందులో భాగమే.. సాఫ్ట్​వేర్ టెక్నాలజీ పార్కు ఆఫ్‌ ఇండియా.

యువ ఆవిష్కరణలను ఒడిసిపట్టే దిశగా

ఎస్టీపీఐ.. యువ నవ ఆవిష్కరణలను ఒడిసిపట్టే ప్రయత్నం చేస్తోంది. విజయవాడ పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో ఎస్టీపీఐ యూనిట్‌ ఉంది. ఇటీవల తమ క్యాంపస్‌ను విన్‌సిటీ టవర్‌తో అప్‌గ్రేడ్‌ చేసింది. ఔత్సాహిక ఐటీ రంగ పరిశ్రమలు స్థాపించే వారికి.... సకల సదుపాయాలతో ఇంక్యుబేషన్‌ సేవలతో కూడిన పని ప్రదేశాన్ని ఈ సంస్థ కల్పిస్తోంది. విజయవాడలోనూ, ఇతర ప్రాంతాల్లో ఐటీ రంగానికి సంబంధించి వినూత్న ఆలోచనలు ఉంటే వాటిని అభివృద్ధి చేసేందుకు ఎస్టీపీఐ కృషి చేస్తోంది. ఆసక్తి కలిగిన యువతతో మాట్లాడి వారికి కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ ప్రవేశపెట్టిన చునావత్‌ పథకం గురించి వివరించి సందేహాలు నివృత్తి చేస్తోంది. మార్గదర్శనం చేయడానికి మెంటార్స్‌ను నియమించింది.

నిధులు సమకూరుస్తుంది

ఐటీ ఆధారిత ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించడానికి యువత ఆసక్తిని ఎస్టీపీఐ కోరుతోంది. వాట్సప్‌, యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఫ్లిప్‌కార్ట్‌ ఇలాంటి వాటికి సంబంధించి వినూత్న ఆలోచనలు ఉండి... ప్రతిభ ఉన్నా వెలుగులోకి రాని పరిస్థితిలో ఉండిపోయిన వారికి అవసరమైన చేయూత ఇవ్వాలని నిర్ణయించింది. 6 నెలల స్టైఫండ్‌తోపాటు సీడ్‌ ఫండింగ్‌ పేరిట రూ. 10 లక్షల నుంచి రూ. 25 లక్షల రూపాయల వరకు అందజేస్తుంది. కేవలం సబ్సిడీగా నిధులు విడుదల చేసి వదిలేయకుండా.. ఆలోచన నుంచి ఆవిష్కరణ వరకు నిపుణుల పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించడం... ఔత్సాహికుల్లో విశ్వాసాన్ని పెంచేందుకు కొత్త ఆవిష్కరణలో కేంద్ర ప్రభుత్వం సైతం వాటాదారుగా నిలిచి వెన్నుతట్టి ముందుకు నడిపిస్తుంది. దీనివల్ల ఏ దశలోనూ నిధుల సమస్య ఉత్పన్నం కాకుండా ఉండేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుందని ఎస్టీపీఐ చెప్తోంది.

ఫ్రీ స్పేస్

విజయవాడ ఎస్టీపీఐ ప్రాంగణంలో ఐటీ ఔత్సాహికులకు పని ప్రదేశం సమకూరుస్తోంది. ఈ సాఫ్ట్‌వేర్‌ పార్కు 50 వర్క్‌ స్టేషన్ల సామర్ధ్యంతో ప్రారంభమై 180 వర్క్‌స్టేషన్లకు విస్తరించింది. ఈ కేంద్రంలో తగిన మౌలిక సదుపాయాలతో కూడిన స్పేస్‌ను కల్పిస్తుంది. అక్కడ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ద్వారా ఆవిష్కరణలకు మరింత పదునుపెట్టి... అత్యద్భుతంగా తీర్చిదిద్దడానికి సహకారం అందిస్తుంది.

ఐటీ రంగానికి సంబంధించిన ఎలాంటి ఆవిష్కరణలకైనా ప్రోత్సాహం ఉంటుంది. వివిధ రంగాలకు ఉపయోగపడే సాఫ్ట్‌వేర్స్‌, మొబైల్‌ అప్లియేషన్స్‌, యాప్స్‌, వీడియో గేమింగ్స్‌ ఇలా ఐటీ ఆధారిత ఎలాంటి ఇతర ఆలోచనలనైనా ఎస్టీపీఐ ఆహ్వానిస్తోంది. మనసులో ఉండే ఆలోచనను మార్కెట్ వరకు అభివృద్ధి చేయడానికి ఈ పథకం ద్వారా వీలు కలుగుతుంది.

ఇవీ చదవండి:

టిక్​టాక్​ కోసం మైక్రోసాఫ్ట్​తో వాల్​మార్ట్​ జట్టు!

ABOUT THE AUTHOR

...view details