ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అన్న క్యాంటీన్లు కొనసాగించాలి' - krishna district

కృష్ణాజిల్లా విజయవాడలో హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్తలు నిరసనకు దిగారు. అనంతరం అన్న క్యాంటీన్లు కొనసాగించాలని డిమాండ్ చేసారు.

Social workers march under Helping Hands in Vijayawada at krishna district

By

Published : Aug 4, 2019, 3:06 PM IST

రంగు ఏదైనా వేసుకోండి ,పేరేదైనా పెట్టుకోండి కానీ పేదలకు పట్టెడన్నం పెడుతున్న అన్న క్యాంటీన్ కొనసాగించండని డిమాండ్ చేస్తూ హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్తలు నిరసనకు దిగారు.పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్న ధ్యేయంతో గత ప్రభుత్వం రాష్ట్రంలో 200 పై చిలుకు అన్న కాంటీన్లను ప్రారంభించిందని హెల్పింగ్ హాండ్స్ రాష్ట్ర అధ్యక్షులు శివరామకృష్ణ అన్నారు.ప్రతిరోజూ సుమారు 2 లక్షల మందికి ఆహారం అందజేస్తున్నారని, అక్షయపాత్ర సంస్థతో ఒప్పందం పూర్తయిందని అన్న క్యాంటీన్లను మూసివేయడం దారుణమన్నారు.ఒప్పందాన్ని తిరిగి పునరుద్ధరించాలని లేదా వేరే ఏదైనా సంస్థ ద్వారా అన్న క్యాంటీన్లకు ఆహారాన్ని సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. అన్న క్యాంటీన్లను కొనసాగిస్తామని చెప్పి మూసివేయడం ఎంత వరకు సబబన్నారు.

అన్న క్యాంటీన్లు కొనసాగించాలి...హెల్పింగ్ హాండ్స్

ABOUT THE AUTHOR

...view details