కృష్ణా జిల్లా గన్నవరంలో పొట్లకాయలు పొడవుగా పెరుగుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. కాసరనేని గోపాలరావు తన సోదరుడు రవివర్ధన్ తమ ఇంటి పెరట్లో వేసిన పొట్ల తీగకు కాయలు పది నుంచి 15 అడుగులు పెరుగుతున్నాయి. ఇవేకాక దొండ, బీర, కాకర ఇతర తీగజాతి కూరగాయలను వీరు పండిస్తున్నారు. కరోనాతో ఇబ్బందులు పడుతున్న పేదలకు వీటిని అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
పొడుగ్గా కాసేస్తా... అందర్నీ ఆశ్చర్యపరుస్తా..! - నందిగామలో పొట్లకాయ పంటలు
కృష్ణా జిల్లా గన్నవరంలో ఓ రైతు.. తన ఇంటి అవసరాల కోసం పండిస్తున్న పొట్ల కాయలు భారీ పొడవుగా పెరుగుతున్నాయి. పది నుంచి పదిహేను అడుగుల పొడవు ఉంటూ స్థానికులకు ఆశ్చర్యం కలిగిస్తోంది.

పొడవుగా కాసిన పొట్లకాయలు