ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతులను హడలెత్తిస్తున్న పాముకాట్లు - snake bits news in krishna dst

కృష్ణా జిల్లా పమిడిముక్కల, ఘంటశాల మండలాల్లో పొలం పనులకు వెళ్లే రైతులు.. పాముల భయంతో ఆందోళనకు గురవుతున్నారు. ఈరోజు నలుగురు రైతుల్ని పాము కాటేసింది.

snake bites in krishna dst pamidimukkala and ghantasala madnalas
snake bites in krishna dst pamidimukkala and ghantasala madnalas

By

Published : Jun 27, 2020, 7:20 PM IST

కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం, ఘంటశాల మండలం పరిధిలో పాములు బెంబేలెత్తిస్తున్నాయి. పొలం పనులకు వెళ్తున్న రైతుల్లో కొందరు పాముకాటుకు గురవతున్నారు. ఈరోజు నలుగురు రైతులు పాముకాటుకు గురయ్యారు. పమిడిముక్కల మండలం పరిధిలో పాముకాటుకు గురైన ఇద్దరికి.. మొవ్వ పీహెచ్​సీ వైద్యులు చికిత్స అందించారు. సకాలంలో ఆసుపత్రికి తీసుకురావటంతో వారికి ప్రాణపాయం తప్పిందని వైద్యుడు శివరామకృష్ణరావు తెలిపారు. ప్రభుత్వ అసుపత్రుల్లో యాంటీ స్నేక్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details