ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నందిగామలో ఆక్రమణల తొలంగిపు..వ్యాపారుల ఆందోళన..ఉద్రిక్తత - farmers protest in nandhigama market

కృష్ణాజిల్లా నందిగామ రైతు బజార్ వద్ద ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత నెలకొంది. చిరు వ్యాపారులు రోడ్లపై ఉల్లిపాయలు, ఇతర సామాగ్రిని పారబోసి రాస్తారోకో చేశారు. వీరితో పాటు.. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆందోళనలో పాల్గొన్నారు.

protest
నందిగామ రైతు బజార్ లో ఆందోళన

By

Published : Sep 2, 2021, 3:38 PM IST

కృష్ణాజిల్లా నందిగామ రైతు బజార్ వద్ద చిరు వ్యాపారులు ఆందోళన చేపట్టారు. రోడ్డు పక్కన ఉన్న అక్రమ కట్టడాలను అధికారులు తొలగించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో చిరు వ్యాపారులు తమ దుకాణాలను తొలగించవద్దంటూ.. ఉల్లిపాయలు, ఇతర సామాగ్రిని పారబోసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వీరితో పాటు.. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆందోళనలో పాల్గొన్నారు. చిరు వ్యాపారులు జీవనోపాధి కోల్పోయారని మాజీ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వంలో పూర్తిగా నాశనం చేయటం తప్ప.. అభివృద్ధి చేసింది శూన్యమని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details