వలస కార్మికుల ఉపాధికి ప్రణాళికలు తయారు చేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అర్హత కలిగిన వలస కార్మికులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఉపాధి హామీ కూలీలు గతేడాది కంటే ఈ ఏడాది పెరిగారన్నారు. ఎడ్ల బండ్ల మీద ఉచితంగా ఇసుకను తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని వివరించారు. విజయనగరం ప్రభుత్వాసుపత్రిని నాన్ కొవిడ్ వైద్యశాలగా మారుస్తున్నామన్నారు.
వలస కార్మికుల ఉపాధికి ప్రత్యేక కార్యాచరణ - వలస కార్మికులుకు ఏపీ ప్రభుత్వం సహాయచర్యలు
రాష్ట్రంలో వలస కార్మికుల ఉపాధికి ఇబ్బంది లేకుండా ప్రణాళికలు తయారు చేస్తోన్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అర్హత కల్గిన వలసల కార్మికులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
వలస కార్మికుల ఉపాధికి ప్రత్యేక కార్యాచరణ